ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్ కొనుగోళ్ల వెనక అదాని హస్తం ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌తో దీర్ఘకాలిక ఒప్పందం నష్టమని ఈఆర్‌సీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ ఒప్పందంలో లోసుగులు, తప్పిదాలు ఉన్నాయని... దీని వల్ల వేలకోట్ల నష్టం వాటిల్లితుందని ఆ శాఖ కార్యదర్శి రాసిన లేఖను తుంగలో తొక్కారని తెలిపారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆయనను గన్‌పార్క్ ముందు నిలబెట్టి కాల్చినా తప్పులేదని రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతిని బహిరంగపర్చినందుకు విద్యుత్ ఉద్యోగి రఘును వరంగల్ అడవుల్లోకి బదిలీ చేశారని ఆరోపించారు.
ప్రభాకరరావు పచ్చి అబద్ధాల కోరు: ఎంపీ రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజల సెంటిమెంట్, కరెంటు కష్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కరెన్సీమూటలుగా మార్చుకోవటానికి పక్కా ప్రణాళికబద్ధంగా వినియోగించుకున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు లేవని టీఆర్‌ఎస్ బుకాయిస్తోందని ఆయన విమర్శించారు.
congress
Last Updated : Aug 29, 2019, 6:04 PM IST