Revanth Reddy Election Campaign in Hyderabad 2023 : జంటనగరాల్లో భూములు ఆక్రమించి, అమ్ముకున్న వాళ్లను ఓడించాలని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పదేళ్లుగా డబుల్ బెడ్రూం ఇవ్వకుండా మోసం చేసిన కేసీఆర్.. మరోసారి మోసపూరిత హామీలు ఇస్తున్నారంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న రేవంత్... వచ్చే నెల నుంచి కరెంట్ బిల్లు కట్టవద్దని సూచించారు.
Revanth Reddy Slams BRS Party : పదేళ్లు గడిచినా పేదలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని బీఆర్ఎస్ నెరవేర్చలేదని... పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆలుగడ్డలు అమ్మినట్లు సనత్‌నగర్ ఎమ్మెల్యే.. పేదల బతుకులను అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లో ఎన్నికల సభలో పాల్గొన్న రేవంత్... బీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు. కేసీఆర్ సర్కారు పేదల ప్రభుత్వం కాదని.. పెద్దల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోఉన్నప్పుడు.. హైదరాబాద్‌లో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రకటించినందు వల్లే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు వేలకోట్లు సంపాదించారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
'పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతే అధికం'
"పేదల కోసం పని చేసే పార్టీ ఏదో ప్రజలు ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. ఈ నగరాన్ని అమ్ముకొని, ఆక్రమించుకొని అన్యాయంగా పేద ప్రజల సొమ్మును కొల్లగొట్టి బతుకున్నదెవరో మీరు ఆలోచించాలి. నమ్మిన ప్రజలను మోసం చేసిన శ్రీనివాస్ యాదవ్కు గుణపాఠం చెప్పాలి. ఇవాళ అందరికి ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ చెబుతున్నారు.. నేను ప్రజలకు ఒకటే చెబుతున్నా.. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంటే నమ్ముతారా ." - రేవంత్ రెడ్డి, టీపీసీసీ ఛీఫ్
ఆచితూచి అడుగేస్తున్న విపక్షాలు - ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి