తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్నికల ముందు ఓమాట... తర్వాత మరోమాట' - revanth reddy

ఎన్నికలు సమీపిస్తున్న వేళ... అభ్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శించుకుంటున్నారు. మల్కాజిగిరి కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రేవంత్​రెడ్డి ప్రచారంలో మోదీ, కేసీఆర్​ తీరుపై మండిపడ్డారు. ఇక్కడ కేసీఆర్​ను గెలిపిస్తే... కారు గుర్తు ఓట్లు దిల్లీకి పోయాక కమలం గుర్తవతాయని ఆరోపించారు.

కారు గుర్తు ఓట్లు.. దిల్లీకి పోయాక కమలం గుర్తవుతాయి

By

Published : Apr 3, 2019, 5:28 PM IST

Updated : Apr 3, 2019, 5:40 PM IST

దేశంలో లోక్​సభ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్యనే జరుగుతున్నాయని మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్​ అభ్యర్థి రేవంత్​రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భాజపా లేదు కానీ... కారు గుర్తు ఓట్లు తీసుకుని దిల్లీకి పోయాక అవి కమలం గుర్తవుతాయని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాక దేశంలో మైనారిటీలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఒక మాట... ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడే నైజం కేసీఆర్​దని పేర్కొన్నారు.

కారు గుర్తు ఓట్లు.. దిల్లీకి పోయాక కమలం గుర్తవుతాయి
Last Updated : Apr 3, 2019, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details