తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth Reddy Counter Tweet to KTR Tweet : 'రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ చూసి.. కేటీఆర్​కు ఏం చేయాలో అర్థం కావట్లేదు' - కాంగ్రెస్‌పై కేటీఆర్‌ వ్యాఖ్యలు

Revanth Reddy Counter Tweet to KTR Tweet : కాంగ్రెస్​పై కేటీఆర్ వ్యాఖ్యలకు.. రేవంత్​రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ చూసి.. కేటీఆర్‌కు ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు కోట్లాది రూపాయలు పెట్టి ఫేక్ ప్రచారాలకు దిగారని ఆరోపించారు. తెలంగాణకు అసమర్థుల పాలన ఇక అవసరం లేదని రేవంత్​రెడ్డి ట్వీట్ చేశారు.

Revanth Reddy Counter Tweet to KTR Tweet
Revanth Reddy

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2023, 9:23 PM IST

Updated : Oct 21, 2023, 9:39 PM IST

Revanth Reddy Counter Tweet to KTR Tweet :బీజేపీ దగ్గర శిష్యరికంతో ఈ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడురేవంత్​రెడ్డి(Revanth Reddy)తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్(Telangana Congress) సునామీ చూసి.. కేటీఆర్‌కు ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు కోట్లాది రూపాయలు పెట్టి ఫేక్ ప్రచారాలకు దిగారని ఆరోపించారు. నిన్నమొన్నటి వరకు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ మిత్ర పార్టీ బీజేపీ 40 శాతం కమీషన్లతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించిందని ధ్వజమెత్తారు. అలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. వంద రోజుల్లోపే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి, రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి వైపు నడిపిస్తున్నట్లు రేవంత్​రెడ్డి వివరించారు.

Revanth Reddy Comments on BRS :ఇప్పుడు తెలంగాణలోనూ కాంగ్రెస్ దూసుకెళ్తుంటే.. ఇప్పటి వరకు నింపుకున్న జేబులను బీఆర్ఎస్​ వాళ్లు ఇప్పుడు దులుపుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎన్నితప్పుడు ప్రచారాలు చేసినా.. కోట్ల రూపాయలను కుమ్మరించినా.. తెలంగాణ ప్రజలు బీజేపీ, బీఆర్‌ఎస్‌ తోడు దొంగలను దుమ్ము దులపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు గానూ.. రేవంత్​రెడ్డి కాంగ్రెస్ వస్తుంది.. తెలంగాణ గెలుస్తుందని ఎక్స్​లో రీట్వీట్ చేశారు.

Revanth Reddy Counter Tweet to KTR Tweet : 'కేటీఆర్ ట్వీట్​కు రేవంత్ కౌంటర్.. తెలంగాణకు అసమర్థుల పాలన ఇక అవసరం లేదు'

అసలేం జరిగిందంటే :రైతులకు కరెంటు ఇవ్వడంలో కాంగ్రెస్ అసమర్థత దశాబ్దాలుగా తెలంగాణలో అందరికీ తెలిసిందేనని మంత్రి కేటీఆర్ ఎక్స్(ట్విటర్​)లో పోస్ట్ చేశారు. ఇప్పుడు కర్నాటక రైతులు కూడా అదే అనుభవంలోకి వచ్చినట్లు కనిపిస్తోందని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌కు ఏ మాత్రం పోటీ కాదని.. రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ నేతలు ఏ మాత్రం సరితూగరని విమర్శించారు. కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ కోత వాస్తవం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. ఖమ్మంలో కాంగ్రెస్‌కు నేతలు నిండుగా ఉన్నా.. ఒక్క సీటు మాత్రమే వచ్చిందని కేటీఆర్‌ తెలిపారు.

KTR Comments on Congress :బీఆర్‌ఎస్‌ అభ్యర్ధులను ప్రకటించి 60 రోజులు అవుతుందని.. భీ ఫారాల పంపిణీ కూడా పూర్తవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో ముందున్నామని.. ఫలితాల్లో కూడా ముందు ఉంటామని తెలిపారు. గతంలో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలే గెలుస్తామని.. కాంగ్రెస్‌కు 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ ఆలస్యంగా మేల్కొన్నారని విమర్శించారు. మణికొండ, మక్తల్‌లో కాంగ్రెస్‌, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ విషయంలో నరేంద్ర మోదీ, రేవంత్‌ వ్యాఖ్యలు దారుణమని విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు దిల్లీకి బానిసలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Revanth Reddy Open Letter to CM KCR : బీసీ కుల గణన వెంటనే చేపట్టాలి.. సీఎం కేసీఆర్‌కు.. రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy Fires on BRS Manifesto : 'కేసీఆర్​.. డబ్బు, మద్యంతో ఎన్నికలు గెలవాలని చూస్తున్నారు.. అందుకే సవాల్​ స్వీకరించలేదు'

Last Updated : Oct 21, 2023, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details