Revanth Reddy Counter to BRS Leaders : రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, ప్రజల అవసరాలకు అనుగుణంగానే కార్యాచరణ ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలని.. మంత్రి హారీశ్‌రావు మొండి వాదనలు చేస్తున్నారని ఆరోపించారు. 2023 సెప్టెంబర్ 16, 17, 18 తేదీలు దేశ రాజకీయాల్లో చరిత్రాత్మకమైనవిగా పేర్కొన్నారు.
Congress Six Guarantees Telangana : విజయభేరి సభలో కాంగ్రెస్ ప్రకటించిన '6 గ్యారెంటీలు' ఇవే!
Congress 6 Guarantee Schemes : హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయభేరి సభ, కాంగ్రెస్ అభయహస్తం గ్యారెంటీ కార్డులను(Congress) ప్రజలకు చేరవేసే కార్యక్రమాలు.. ఈ మూడు రోజుల్లో జరిగాయని రేవంత్ వివరించారు. ఈ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో విజయవంతం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ నేతలకు, రాష్ట్రస్థాయి నాయకులు, కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.
70 ఏళ్ల తరువాత హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయని రేవంత్ పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తనకు గురుతర బాధ్యతను అప్పగించిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను సోనియా గాంధీ ప్రకటించారని.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించనున్నామని వివరించారు.
INC Telangana Latest News :రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15000, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12000 అందిస్తామన్నారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇంటి స్థలంతో పాటు.. ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు అందించనున్నామని స్పష్టం చేశారు. యువ వికాసం ద్వారా చదువుకునే విద్యార్థులకు రూ.5 లక్షల వరకు ఆర్ధిక సాయం అందించనున్నామన్నారు.