Revanth Reddy fires on KCR Dharani issue : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ భూములపై విచారణ జరిపిస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అన్నారు. ఇందులో దోషిగా ఉన్న వారికి శిక్ష వేయిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ధరణి పోర్టల్ అనేది కేసీఆర్‌కి బంగారు గుడ్డు పెట్టే బాతులాగా మారిందని ఆరోపించారు. రాష్ట్ర భూముల వివరాలు తెలంగాణ ప్రభుత్వం దగ్గర లేవని పేర్కొన్నారు.
Timpapur Bhudan land dispute : ధరణి రద్దు చేస్తే తమ కుట్ర బయట పడుతుందని ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు.ధరణి సమస్యలు క్లియర్ కావాలంటే 30శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని ఆరోపించారు. ధరణి ఫిర్యాదు దారుల నుంచి వసూలు చేసే వెయ్యి రూపాయల రుసుము ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. ప్రజలు చెల్లించిన డబ్బులను ప్రభుత్వం వెనక్కి ఇవ్వాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ తిమ్మాపూర్ భూములను దోచుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ భూ కుంభకోణంలో బీఆర్ఎస్ నేతలు, పార్టీ ఫిరాయించిన నేతలున్నారని విమర్శించారు.
- Revanthreddy on Dharani Portal : 'కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణిని రద్దు చేస్తాం'
- Problems with Dharani Website : అన్నదాతలను అరిగోస పెడుతున్న 'ధరణి లోపాలు'
కలెక్టర్లను కేటీఆర్ కీలు బొమ్మలుగా మార్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తుందని, ధరణి రద్దు చేస్తే రైతు బందు, రైతు బీమా రాదని కేసీఆర్ తెలంగాణ ప్రజలని కన్ఫ్యుజ్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలో ధరణి బాధితులు తమ ఆవేదన తెలియచేశారని గుర్తు చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే.. ధరణిని రద్దుచేసి ప్రజలకు ఉపయోగపడే నూతన విధానం తీసుకొస్తామని ప్రకటించారు.