Revanthreddy Comments on BRS Party: బీఆర్ఎస్కు ఈసీ ఆమోదం తెలపడంతో సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలతో సీఎం కేసీఆర్‌కు బంధం తెగిపోయిందని రేవంత్ విమర్శించారు. పేగు బంధంతో పాటు పేరు బంధం కూడా తెగిపోయిందని ఆరోపించారు.
టీఆర్ఎస్, బీజేపీ నేతలు బహిరంగంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నా.. వారి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి తెలంగాణపై ఏనాడూ ప్రేమలేదని... ఈసీకి కేసీఆర్ లేఖ రాసిన అడ్రసులోనూ ఏపీగా పేర్కొనడంపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పేరునే కాదు... మనుగడను చెప్పుకోవడం లేదన్నారు. 2 రాష్ట్రాలను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేత మాటల్ని సీఎం ఎందుకు ఖండించడంలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రజలతో సీఎం కేసీఆర్‌కు పేగుబంధం తెగిపోయింది: రేవంత్‌రెడ్డి
'తెలంగాణ ప్రజలతో సీఎం కేసీఆర్‌కు బంధం తెగిపోయింది. పేగు బంధంతో పాటు పేరు బంధం కూడా తెగిపోయింది. ఈసీకి కేసీఆర్ లేఖ రాసిన అడ్రసులోనూ ఏపీగా పేర్కొనడం జరిగింది. 2 రాష్ట్రాలను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని చూస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను కేసీఆర్, కేటీఆర్ ఖండించలేదు. అంటే సజ్జల చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దతిస్తున్నట్టుగానే ఉంది.'-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఘనంగా సోనియాగాంధీ పుట్టిన రోజు వేడుకలు..ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ బోయిన్‌పల్లిలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. గాంధీ ఐడియాలజీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: