Revanth Reddy challenge to KTR: మునుగోడులో నిజాయితీగా ఎన్నికలను ఎదుర్కొంటామని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పగలవా అని మంత్రి కేటీఆర్‌ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఐదేళ్లు మహిళలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వని తెరాస ప్రభుత్వం.. మునుగోడులో ఆడబిడ్డను ఓడించడానికి రూ.కోట్లు ఖర్చు చేయాలా అని నిలదీశారు. వేలాది మంది మార్బలంతో మునుగోడుపై దాడి చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి:మును'గోడు' పట్టని పార్టీలు.. ప్రచారాల్లో పరస్పర ఆరోపణలకే పరిమితం