Revanth Reddy challenged BRS : ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట బీఆర్ఎస్ ఓట్లు అడగకూడదు.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఉన్న చోట కాంగ్రెస్(Congress) ఓట్లు అడగదని ఈ సవాల్‌కు బీఆర్ఎస్(BRS) సిద్ధమేనా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. ఈ సవాల్‌ను స్వీకరిస్తే బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్‌ను రేవంత్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు చేశారు.
"కృష్ణా, గోదావరి జలాలను హైదరాబాద్‌కు కాంగ్రెస్ పార్టీనే తీసుకువచ్చింది. హైటెక్ సిటీని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌కే. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు అవినీతిని పాల్పడ్డారు. ఇంకా సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇస్తేనే కామారెడ్డిలో ఓట్లు అడగాలని" టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
Congress Chevella Praja Garjana Sabha : ఈ నెల 26న చేవెళ్ల ప్రజాగర్జన సభ.. SC, ST డిక్లరేషన్ విడుదల చేయనున్న ఖర్గే
Revanth Reddy Comments On BRS : బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో రెండు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా కట్టలేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అదే కాంగ్రెస్ హయాంలో అయితే గ్రామగ్రామాన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని.. రెండు పడక గదులు ఉన్న చోట బీఆర్ఎస్ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు బీఆర్ఎస్, కేసీఆర్ సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఇలా సవాల్ స్వీకరిస్తే.. ఈసారి ఆ పార్టీకి డిపాజిట్లు కూడా వస్తాయో చూద్దామన్నారు.
Congress MLA Ticket Applications : కాంగ్రెస్ రేసుగుర్రాల ఎంపిక.. తొలిరోజు 18 దరఖాస్తులు
"పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. అవినీతి జరిగిందని నిరూపించడానికి కాంగ్రెస్ సిద్ధం. కాంగ్రెస్ హాయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించాం. మరి మీ హాయాంలో ఎన్ని ఇళ్లు కట్టించారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోటకు బీఆర్ఎస్ వెళ్లవద్దు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఉన్న దగ్గరు కాంగ్రెస్ వెళ్లదు. ఇలా ఉంటే బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా గల్లంతు ఖాయం." - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Congress Praja Garjana Sabha in Chevella On August 26 : ఈనెల 26న చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన సభ ఉంది.. ఆసభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరుకానున్నారని తెలిపారు. మునుగోడులో కమ్యూనిస్టులతో గెలిచి.. నేడు కమ్యూనిస్టులతో ఒక్క అసెంబ్లీ సీటు ఇవ్వకుండా తెగదెంపులు చేసుకున్నారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని మరోసారి రుజువు అయిందన్నారు. కేసీఆర్ దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్‌నే ప్రత్యామ్నాయమని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు :
- అధికారం చేపట్టిన ఏడాదిలోపే ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ.
- అధికారం చేపట్టిన సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు.. ప్రతి సంవత్సరం జాబ్‌మేళా
- ఇళ్లు కట్టుకోవడానికి ప్రతి పేదవాడికి, పెళ్లైన పేద జంటకు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల నగదు.
- రాజీవ్ ఆరోగ్య శ్రీని బలోపేతం చేసి రూ.5 లక్షలతో వైద్య ఖర్చులు భరిస్తాం.
- గ్యాస్ సిలిండర్‌ను రూ.500లకే.
- ప్రతినెల ఒకటో తేదీన పేదవాళ్లకు ఫించను రూ.4000.
Rekhanayak joing Congress : కాంగ్రెస్‌లో చేరనున్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్
Revanth Reddy on BRS Candidates List : 'కేసీఆర్ స్వరంలో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది'