తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్​ స్నేహితుడి సంస్థకు ఎందుకు టెండర్​ ఇచ్చారు

రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల​ మార్కులను తారుమారు చేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్​రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ తన స్నేహితుల ప్రైవేటు సంస్థ గ్లోబరీనాకు టెండర్​ ఇచ్చారని ఆరోపించారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు:రేవంత్​ రెడ్డి

By

Published : May 2, 2019, 3:07 PM IST

ఇంటర్​ ఫలితాల విషయంలో విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. మార్కులు తారుమారు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఎంసెట్​ పేపర్​ లీకేజీ​ కుంభకోణం వ్యవహారం 3 సంవత్సరాలైనా... ఇంతవరకు తేలలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంసెట్​ పేపర్​లో నిందితులుగా ఉన్న రావత్​, కమలేశ్ అనుమానస్పదంగా మృతి చెందారని గుర్తు చేశారు. మాగ్నటిక్​ ఇన్ఫోటెక్​ సంస్థపైన ఎందుకు కేసులు పెట్టలేదని అన్నారు. 20 సంవత్సరాలుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ సంస్థ సీజీజీని తప్పించి... కేటీఆర్ స్నేహితుల ప్రైవేటు సంస్థ గ్లోబరీనాకు ఎందుకు టెండర్ ఇచ్చారని ప్రశ్నించారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు:రేవంత్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details