తెలంగాణ

telangana

ETV Bharat / state

REVANTH REDDY: TSPSC పేపర్‌ లీకేజీపై పోరుకు సిద్ధమైన కాంగ్రెస్.. కార్యాచరణ ఇదే..!

Revanth Reddy fire on KCR: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై పోరును ఉద్ధృతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ దిశగా పోరాట కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 21 నల్గొండలోని మాహాత్మాగాంధీ యూనివర్సిటీలో, 24న ఖమ్మంలో, 26న ఆదిలాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మే 4 లేదా 5 తేదీల్లో హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ మైదానంలో నిర్వహించనున్న నిరుద్యోగుల భారీ బహిరంగసభకు పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ హాజరుకానున్నట్లు ప్రకటించారు.

REVANTH REDDY
REVANTH REDDY

By

Published : Apr 18, 2023, 4:21 PM IST

Revanth Reddy fire on KCR: సీఎం కేసీఆర్‌, ప్రధాని మోదీలు ఇద్దరూ విద్యార్థులను నట్టేటా ముంచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా ఇద్దరూ విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ రద్దు చేసే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉన్నప్పటికి.. రద్దు చేయడం లేదని అన్నారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో చిన్నస్థాయి ఉద్యోగుల అరెస్టుతో సిట్‌ సరిపెట్టిందని అన్నారు.

ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు: ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నారని విమర్శించారు. సిట్‌ అధికారులు కూడా మంత్రి కేటీఆర్‌ చెప్పినట్లే నడుచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఎన్‌ఎస్‌యూఐ పోరాటం వల్ల ప్రశ్నపత్రాల లీకేజ్‌ కేసులో ఈడీ కూడా ప్రవేశించినట్లు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్‌.. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. దేశంలో ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ.. 9 ఏళ్లల్లో 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని పార్లమెంటులో ఒప్పుకున్నారని అన్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు వరదల్లో ఏ బండి కొట్టుకుపోతే ఆ బండి ఇస్తామని బండి సంజయ్ చెప్పారని.. ఎన్నికల తర్వాత అడిగితే బీమా కంపెనీ వాళ్లు ఇస్తారని అంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అంటున్న బండి సంజయ్‌కు.. ప్రభుత్వ శాఖలు ఎన్ని ఉన్నాయో, ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలియదని విమర్శించారు.

ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ పశ్నాపత్రం లీకేజీ అంశంపై ఆ పార్టీ కార్యచరణను రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 21 నల్గొండలోని మాహాత్మాగాంధీ యూనివర్సిటీలో, 24న ఖమ్మంలో, 26న ఆదిలాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మే 4 లేదా 5 తేదీల్లో హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ మైదానంలో నిర్వహించనున్న నిరుద్యోగుల భారీ బహిరంగసభకు పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ హాజరుకానున్నట్లు చెప్పారు.

"సీఎం కేసీఆర్‌, ప్రధాని మోదీలు ఇద్దరూ విద్యార్థులను నట్టేటా ముంచారు. ఉద్యోగాలు ఇవ్వకుండా ఇద్దరూ విద్యార్థులను మోసం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్‌సీని రద్దు చేసే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉంది.. అయినా రద్దు చేయలేదు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో చిన్నస్థాయి ఉద్యోగుల అరెస్టుతో సిట్‌ సరిపెట్టింది. సిట్‌ అధికారులు కూడా మంత్రి కేటీఆర్‌ చెప్పినట్లే నడుచుకుంటున్నారు".-రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

సీఎం కేసీఆర్‌, ప్రధాని మోదీలు ఇద్దరూ విద్యార్థులను నట్టేటా ముంచారు: రేవంత్‌రెడ్డి

ఇవీ చదవండి:

'ప్రాణహిత-చేవెళ్లకు అంబేడ్కర్‌ పేరు ఎందుకు తొలగించారో చెప్పాలి'

'మంత్రి కేటీఆర్​ ధన దాహంతో భాగ్యనగరం ధ్వంసం'

'కేసీఆర్ స్వార్థ రాజకీయాలతో నిరుద్యోగులకు అన్యాయం'

ABOUT THE AUTHOR

...view details