ఎన్నికల సమయంలో వివిధ కేసులు నమోదైన పలు రాజకీయ పార్టీల నాయకులు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. గడువు ముగిసిన తర్వాత ప్రచారం చేయడం, రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహించిన సందర్భాల్లో నమోదైన కేసుల్లో కోర్టు ముందు హాజరయ్యారు.
నాంపల్లి కోర్టుకు.. రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు - నాంపల్లి కోర్టు
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సహా.. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో వివిధ కేసులు నమోదైన కేసుల్లో వారంతా సోమవారం కోర్టుకు హాజరయ్యారు.
నాంపల్లి కోర్టుకు.. రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు
న్యాయమూర్తి ముందు హాజరైన వారిలో.. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, తెరాస మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్యలు కోర్టుకు వచ్చారు.
- ఇదీ చూడండి :నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం