revanth-komati reddy in vari deeksha: రాష్ట్రంలో పండిన వరి ధాన్యం ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ రెండు రోజులు 'వరిదీక్ష'(congress vari deeksha) చేపట్టింది. ఈ దీక్షలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన కోమటిరెడ్డి ఇవాళ ధర్నా చౌక్(dharna chowk) వద్ద నిర్వహిస్తున్న దీక్షకు హాజరయ్యారు. ఆయన రాకను గమనించిన రేవంత్ రెడ్డి కోమటిరెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. దీక్షకు హాజరైన కోమటిరెడ్డి వేదికపై రేవంత్‌రెడ్డి పక్కనే కూర్చున్నారు. కాసేపు వారిద్దరు ముచ్చటించుకున్నారు. ఇవాళ్టి దీక్షకు హాజరుకానున్నట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారమే ప్రకటించి నేడు దీక్షలో పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా పాల్గొనడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఫలించిన వీహెచ్ మంత్రాంగం
రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఎన్నికైన నాటి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా ఎడమొహం, పెడమొడం లాగానే ఉన్నారు. వారి ఇరువురి మధ్య సంధి కుదిర్చేందుకు కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్లు పలుమార్లు యత్నించారు. గత కొన్ని రోజుల నుంచి పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు(vh) రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు వీరితో వీహెచ్ మంత్రాంగం ఫలించినట్లయింది.