Revanth Reddy Allegations on Liquorshop Licence :తెలంగాణలో జరుగుతున్న అరాచక పాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్లో చేరిన కొత్త నాయకులను ఆహ్వానిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడిన ఆయన.. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ రూ. లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ 10వేల ఎకరాల భూమిని కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకుందన్నారు.
Revanthreddy on Assembly Seats : 'రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యతను నేను తీసుకుంటా'
Revanth on Double Bedroom Houses Delay : హైదరాబాద్లో డబుల్ బెడ్ రూం (Double Bedroom Houses) ఇళ్లు నిర్మించడానికి స్థలాలు లేవని పేరొన్న కేసీఆర్.. వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే కేసీఆర్ ఖాళీ భూములను అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా భూములు కొన్నవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రేవంత్ సూచించారు. కేసీఆర్ సొంత మనుషులకు అప్పగించుకునేందుకే వైన్ షాపులకు ముందే టెండర్లు (wine shops Licens process) వేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. షాపులకు ఇంకా నాలుగు నెలలు సమయం ఉండగా.. ముందే టెండర్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు.
KTR Challenge to Telangana Congress Leaders : 'ఓఆర్ఆర్ అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా'
Licensing process for wine shops:కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. వైన్ షాపులకు మళ్లీ టెండర్లు ప్రక్రియా నిర్వహిస్తామని రేవంత్ తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్తమ వాళ్లపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. పోలీసులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని.. మరో వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని జోస్యం చేశారు.