Revanth Reddy Adilabad Tour Today : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం(Congress Campaign Telangana)లో వేగంగా ముందుకు సాగుతోంది. విజయభేరీ సభ పేరుతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. బీఆర్‌ఎస్ సర్కార్ వైఫల్యాలు, మోదీ, కేసీఆర్ బంధంపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. కాంగ్రెస్(Congress) ప్రకటించిన ఆరు గ్యారంటీలను వివరిస్తూ తమకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరుతున్నారు.
Revanth Reddy Speech at Khanapur :రెండో రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా ఖానాపూర్‌లో విజయభేరీ సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు పటేల్‌ను గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్, బీజేపీలు డబ్బులున్న వారికే టికెట్లిచ్చాయని.. బొజ్జులాంటి పేదలకు సైతం తమ పార్టీ ఎన్నికల్లో నిలబెట్టిందని చెప్పారు. 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే తాను పోటీ చేయనని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చాక ధరణిని రద్దు చేసి తీరుతామన్నారు.
'మోదీ మేడిగడ్డను ఎందుకు పరిశీలించలే - బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటే'
"మేడిగడ్డ బ్యారేజీ మేడిపండులాగా పగిలిపోయింది. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ లక్ష కోట్ల దోపిడీ చేశారు.దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా?. అవినీతిపరుల పాలిట చండశాసనుడినని మోదీ అన్నారు. కుంగిన మేడిగడ్డ, పగిలిన అన్నారం గురించి మోదీ ఎందుకు మాట్లాడలేదు. మేడిగడ్డను చూడకపోతే మీ పర్యటన వల్ల ఏం లాభం. మోదీకి కేసీఆర్ మిత్రులు కాకుంటే.. ఎందుకు చర్యలు తీసుకోరు. రాష్ట్రంలో బీజేపీకి 100చోట్ల డిపాజిట్లు దక్కే పరిస్థితిలేదు."- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
Revanth Reddy Speech at Adilabad :అనంతరం, ఆదిలాబాద్ డైట్ మైదానంలో విజయభేరి సభకు హాజరైన రేవంత్‌రెడ్డి... కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కేసీఆర్(KCR) సర్కార్ అవినీతికి మేడిగడ్డ మేడిపండులా పగిలిపోయిందని ఆరోపించారు. అవినీతిని సహించబోనని హైదరాబాద్ పర్యటనలో చెప్పిన మోదీకి.. కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడలేదని ప్రశ్నించారు. వచ్చే 100 నియోజకవర్గాల్లో డిపాజిట్‌లు కోల్పోయే బీజేపీ(BJP).. బీసీని సీఎం చేస్తామని చెప్పి, ఎవరిని మోసం చేస్తుందన్నారు..