తెరాసలో సీఎల్పీ విలీనాన్ని కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ భట్టి విక్రమార్క చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాదని...కల్వకుంట్ల రాజ్యాంగాన్నికేసీఆర్ తెలంగాణ ప్రజల నెత్తిపై రుద్దుతున్నారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ సమస్య మాత్రమే కాదని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సమస్య అన్నారు. శాసనసభ్యుల విలీన ప్రక్రియ స్పీకర్ పరిధిలో ఉండదన్నారు. 12 మంది ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేస్తే పట్టించుకోని స్పీకర్ విలీనాన్ని ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు.
'ఇది కాంగ్రెస్‌దే కాదు... నాలుగు కోట్ల ప్రజల సమస్య' - trs
తెరాస సర్కారు నిరంకుశ పాలనకు పాల్పడుతోందని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ ఐదేళ్లలో కేసీఆర్ ఫిరాయింపులపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై పెట్టలేదన్నారు.
!['ఇది కాంగ్రెస్‌దే కాదు... నాలుగు కోట్ల ప్రజల సమస్య'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3514644-67-3514644-1560083750870.jpg)
సీఎల్పీ విలీనం సరైంది కాదు: రేవంత్ రెడ్డి
Last Updated : Jun 9, 2019, 7:53 PM IST