తెలంగాణ

telangana

ETV Bharat / state

తన భూముల్లో జోక్యం చేసుకోవద్దంటూ.. రేవంత్ పిటిషన్ - Revanth file the petition

కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తన భూముల్లో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుంటున్నారని లంచ్​ మోషన్​ పిటిషన్​ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణ రేపటికి వాయిదా వేస్తూ.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది.

Revanth file the petition
పిటిషన్ దాఖలు చేసిన రేవంత్

By

Published : Mar 5, 2020, 7:28 PM IST

గోపన్​పల్లి భూముల వ్యవహారంలో హైకోర్టును కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆశ్రయించారు. తన భూముల్లో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుంటున్నారని.. అత్యవసర విచారణ జరపాలని కోరుతూ.. రేవంత్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్​ దాఖలు చేశారు. నోటీసు ఇవ్వకుండా తన భూముల్లో అధికారులు చొరబడ్డారని ఆరోపించారు. భూమిని తమకు స్వాధీనం చేయాలని శేరిలింగంపల్లి ఆర్డీవో బెదిరిస్తున్నారని పిటిషన్​లో పేర్కొన్నారు. ఆర్డీవో, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఒత్తిళ్లకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి 15 ఏళ్ల క్రితమే ఆ భూములు కొనుగోలు చేశారని.. ఆర్డీవో నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నారని పిటిషనర్​ తరఫు న్యాయవాది వేణుగోపాల్ వాదించారు. చర్యలు తీసుకునే ముందు కనీసం నోటీసు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వివాదానికి సంబంధించి పూర్తి వివరాలను రేపు తెలుసుకొని చెబుతానని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలుపగా న్యాయస్థానం అంగీకరించింది. విచారణ రేపటికి వాయిదా వేస్తూ.. ఎలాంటి చర్యలు చేపట్టవద్దని రెవెన్యూ అధికారులను ఆదేశించింది.

ఇదీ చూడండి:'కరోనా సోకకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం'

ABOUT THE AUTHOR

...view details