తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ఉగాది సంతోషమే లేదు'

Revanth Reddy on Ugadi: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. ఈ ప్రభుత్వాల వల్ల ఏ కుటుంబంలోనూ సంతోషంలేదన్నారు. అడ్డగోలుగా అన్ని ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు.

By

Published : Apr 2, 2022, 3:46 PM IST

Revanth
Revanth

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ఉగాది సంతోషమే లేదు'

Revanth Reddy on Ugadi: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల ఏ కుటుంబంలో కూడా ఉగాది పండుగ సంతోషం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. సమాజంలో జీవిస్తున్న ప్రతి జీవిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకునే ప్రయత్నం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. యూపీఏ ప్రభుత్వంలో నిత్యవసర వస్తువులు పేద ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేసినట్లు గుర్తుచేశారు. యూపీఏ దిగిపోయే సమయంలో గ్యాస్ రూ.414, డీజిల్ రూ.55, పెట్రోల్ రూ.71 రూపాయలకు అందుబాటులో ఉన్నాయన్నారు. గాంధీభవన్​లో జరిగిన ఉగాది సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. పంచాంగకర్త పంచాంగం చదివి కాంగ్రెస్ నాయకులకు వినిపించారు.

అప్పట్లో మేమే భరించాం:అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న అప్పటి ప్రభుత్వమే భరించింది తప్ప ప్రజలపై భారం మోపలేదని రేవంత్ అన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పూర్తిగా తగ్గినప్పుడు... కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాలలో పన్నుల రూపం రూ.26 లక్షల కోట్లు దోచుకుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు భారం మోపిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 8 సంవత్సరాలో రూ.36 లక్షల కోట్లు పన్నుల రూపంలో భారం మోపాయని వాపోయారు.

'ఎన్నికలకు ముందు 4 నెలలు అనాపైస కూడా పెంచని మీరు... 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత అమాంతం ధరలు పెంచుతున్నారు. రూ.115 లీటర్ పెట్రోల్ ఉంటే... అన్ని ఖర్చు కలుపుకొని రూ.50కే వస్తుంది. 55 రూపాయలు డీజిల్​పై పన్ను రూపంలో వసూలు చేస్తున్నారు. అక్టోబర్ 4, 2021 సివిల్ సప్లయ్ కమిషనర్ అనిల్ కుమార్ ఎఫ్​సీఐకి లెటర్ రాశారు. భవిష్యత్​లో పార బాయిల్డ్ రైస్ ఇవ్వమని కేసీఆర్ సంతకం పెట్టారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతుల జుట్టు కేసీఆర్ అందించారు.' -- రేవంత్​రెడ్డి, పీసీసీ చీఫ్

ఇక నిరనసలు: వడ్ల కొనుగోలుపై మార్చి మొదటి వారం లోపే సిద్ధం చేసుకోవాల్సిందన్న రేవంత్... ఉగాది వచ్చినా ఇంత వరకు అంచనాలు లేవని విమర్శించారు. ఇప్పుడు ప్రక్రియ మొదలు పెట్టిన నెల రోజులు పడుతుందని... దీనికి రైతులు చావాల్సిందేన అని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటిపై కాంగ్రెస్ నిరసన కార్యాచరణ చేపడుతోందన్నారు. ఈనెల 4న మండల కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాల ముందు, 6న జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు, 7న విద్యుత్ సౌదా, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడిలో మేమంతా పాల్గొంటామని అన్నారు. ఈ పోరాటాలకు ప్రజలే నాయకత్వం వహించాలని కోరారు. తెలంగాణలో క్రాప్ హాలీడే ఇచ్చి వరి వైపు సీఎం కేసీఆర్ మళ్లించినట్లు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు వరి వేస్తే ఉరే అని అంటున్నట్లుగా తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని రేవంత్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'ఉగాది పండుగ భారతీయ సంస్కృతికి ప్రతీక'

ABOUT THE AUTHOR

...view details