తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసలో ముసలం: రేవంత్​ - CLP

ముఖ్యమంత్రి కేసీఆర్​, మాజీమంత్రి హరీశ్​రావుకు మధ్య ముసలం నడుస్తోందని కాంగ్రెస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవుల్లో సముచిత స్థానం కల్పించకుండా పక్కన పెట్టారంటూ... తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

రేవంత్​ ఆసక్తికర వ్యాఖ్యలు...!

By

Published : Feb 18, 2019, 8:22 PM IST

Updated : Feb 19, 2019, 9:57 AM IST

రేవంత్​ ఆసక్తికర వ్యాఖ్యలు...!
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలియకుండానే ఎన్నికల్లో పోటీ చేసిన కొంతమందికి హరీశ్​రావు నిధులు సమకూర్చినట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మిడ్ మానేరు, గౌరెల్లి, తోటపల్లి ప్రాజెక్టుల్లో వెయ్యి కోట్ల రూపాయల పనులను టెండర్ లేకుండానే గుత్తేదారులకు హరీశ్​ కట్టబెట్టాడని విమర్శించారు. అంచనాలు పెంచి పాత కాంట్రాక్టులకు పనులు ఇప్పించడం ద్వారా 600 నుంచి 700 కోట్ల రూపాయలు అక్రమంగా పోగేశారని ఆక్షేపించారు.

హరీశ్ వీడియో బయటపెడతా

అమిత్​షాతో హరీశ్​రావు మాట్లాడిన వీడియోకు సంబంధించిన వ్యవహారాన్ని బయటపెడతానని రేవంత్ అన్నారు. ఆ వీడియోను చూసే కేసీఆర్​ ఆయన్ని పక్కనపెట్టారని తెలిపారు. నాయిని, కడియం, తుమ్మల నాగేశ్వర్‌రావుకు పదవులు ఉండవని, ఈటల రాజేందర్‌కు 50 శాతం అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి చనిపోతే పరామర్శకు రెండు సార్లు వెళ్లిన సీఎం కేసీఆర్.. జవానులు చనిపోతే నివాళులర్పించడానికి సమయంలేదా అన్ని ప్రశ్నించారు.

నేనే ఆందోళనకు దిగుతా

తెదేపాతో పొత్తుల వల్ల లాభామా నష్టమా అనేది పార్టీ వేదికపై చర్చిస్తామన్న రేవంత్ ... లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులపై పీసీసీ అధ్యక్షునిదే తుది నిర్ణయమన్నారు. ఎర్రజొన్న రైతుల సమస్యను వారం రోజుల్లో పరిష్కరించకపోతే.. స్వయంగా తానే ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. ఈడీ కేసుల్లో బీజీగా ఉండటం వల్ల పార్టీ సమీక్షలకు హాజరుకాలేదని రేవంత్​ తెలిపారు.

Last Updated : Feb 19, 2019, 9:57 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details