హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎఫేర్ పబ్‌లో రేవ్ పార్టీ నిర్వహించిన కేసులో ముగ్గురు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 12న పబ్‌లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో 21 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారిని బాధితుల కింద పరిగణించి వదిలివేసినట్లు పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. సిగ్నోవా అనే పంట పరిశోధన సంస్థ తమ సిబ్బంది కోసం రేవ్ పార్టీ నిర్వహించినట్లు చెప్పారు.
పబ్‌లో రేవ్ పార్టీ నిర్వహించిన ముగ్గురి అరెస్టు - Organisers Arrest
పబ్బుల్లో అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని పశ్చిమమండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో ఈ నెల 12న రేవ్ పార్టీ నిర్వహించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
పబ్‌లో రేవ్ పార్టీ నిర్వహించిన ముగ్గురి అరెస్టు
ఆ సంస్థ యజమాని శ్రీనివాసనాయుడు, మేనేజర్ మహ్మద్ మోయిన్, మరో దళారి ప్రసాద్ గౌడ్‌ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. పబ్ యజమాని సంతోష్‌రెడ్డి, మేనేజర్‌ను అరెస్టు చేయాల్సి ఉందని డీసీపీ వివరించారు. పబ్బుల్లో అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని హెచ్చరించారు.
ఇవీ చూడండి: నగ్నంగా నృత్యాలు చేస్తున్న 22 మంది యువతుల అరెస్ట్