తెలంగాణ

telangana

ETV Bharat / state

పౌరసరఫరాల శాఖ కమిషనర్​గా సత్యనారాయణ రెడ్డి - హైదరాబాద్​ ఎర్రమంజిల్​ పౌరసరఫరాల భవన్

పౌరసరఫరాల శాఖ కమిషనర్​, సంస్థ ఛాన్స్​లర్​గా విశ్రాంత ఐఏఎస్​ అధికారి సత్యనారాయణ రెడ్డి పదవి చేపట్టారు. హైదరాబాద్​ ఎర్రమంజిల్​ పౌరసరఫరాల భవన్​లో అకున్​ సబర్వాల్​ ఆయనకు బాధ్యతలు అప్పగించారు.

పౌరసరఫరాల శాఖ కమిషనర్​గా సత్యనారాయణ రెడ్డి

By

Published : Oct 31, 2019, 8:54 PM IST

పౌరసరఫరాల శాఖ కమిషనర్​గా సత్యనారాయణ రెడ్డి
పౌరసరఫరాల శాఖ కమిషనర్‌, సంస్థ వైస్‌ ఛాన్స్​లర్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.సత్యనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో అకున్‌ సబర్వాల్‌ ఆయనకు బాధ్యతలను అప్పగించారు. పౌరసరఫరాల శాఖ, సంస్థ ఉన్నతాధికారులతో సత్యనారాయణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఇక రానున్న ఒకటి రెండురోజుల్లో ప్రతి విభాగాన్ని పూర్తిస్థాయిలో సమీక్షిస్తానని కమిషనర్​ సత్యనారాయణ తెలిపారు. ప్రధానంగా గత సంవత్సరం అనుభవాలు దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తుకుండా చూస్తామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details