హైదరాబాద్ వనస్థలిపురం గాయత్రినగర్‌లోని విశ్రాంత ఉద్యోగి నరసింహ వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేందుకు తన ఇంటి నుంచే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇంట్లో ఉన్న బోరుబావి చుట్టూ ఇప్పటికే ఇంకుడు గుంత తవ్వించిన నరసింహ... ఇంటి ముందు భాగంలో కూడా ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకొని వరద నీటిని ఒడిసిపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇంటి ముందున్న సిమెంటు రోడ్డు గచ్చును స్వయంగా పలుగు, పారతో తొలగించారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ఇంకుడు గుంతలు తవ్వాలని సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి మళ్లించేందుకు నరసింహ చేస్తున్న కృషిని జాగృతి అభ్యుదయ సంఘం అభినందించింది.
వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు పలుగు పట్టిన విశ్రాంత ఉద్యోగి - ఇంకుడు గుంతలు ఏర్పాటు
కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్ మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఒకప్పుడు 100 అడుగులకే కనిపించిన నీటి జాడ ఇప్పుడు 2 వేల అడుగుల లోతు తవ్వినా చుక్క నీరు రాని పరిస్థితి నెలకొంది.
విశ్రాంత ఉద్యోగి