తెలంగాణ

telangana

ETV Bharat / state

Old Man Suicide in Hyderabad : 'బలగం' ఉన్నా బతకలేకపోతున్నా...!

Old Man Commits Suicide in Hyderabad : ముగ్గురు కుమారులు.. ఇద్దరు కుమార్తెలు.. జీవిత భాగస్వామి.. మనవలు.. మనవరాళ్లు.. అందరూ ఉన్నా ఆదరించే వారు లేక.. ఒంటరిగా బతుకుతూ.. జీవితంపై విరక్తి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ వృద్ధుడి ఆత్మహత్య ఘటన మానవ సంబంధాలపై ఇటీవల ఊరూరా ప్రదర్శితమవుతున్న ‘బలగం’ సినిమాను తలపిస్తోంది.

Suicide
Suicide

By

Published : May 10, 2023, 10:37 AM IST

Old Man Commits Suicide in Hyderabad: పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు.. వారే తమ జీవితమని, కడవరకు చూస్తారని నమ్ముతారు. తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. వారి ఆలనాపాలనా చూసుకుంటారు. వారికి చిన్న కష్టం వచ్చినా.. తమ ప్రాణం పోయేంతలా కన్నవారు విలవిల్లాడుతారు. తీరా వారు పెద్దవారైన తర్వాత చూస్తే.. అమ్మానాన్నలే అవసరం లేదని చెప్పేసిన కుమారులు, కుమార్తెలు కూడా ఈ లోకంలో ఉన్నారు. వారి దగ్గర నుంచి ఆస్తి కావాలి కానీ.. కన్నవారు మాత్రం అవసరం లేదు. వారిని కన్న పాపానికి చివరకు వీధిపాలు చేసి.. అభాగ్యులుగా మార్చేస్తున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లాలో ఓ వృద్దుడు తన చితిని తానే పేర్చుకుని చనిపోయిన ఘటన మరువక ముందే మంగళవారం అలాంటి ఘటనే మరొకటి భాగ్య నగరంలో వెలుగు చూసింది.

వృద్ధాప్యం పైబడుతుంటే కన్న తల్లిదండ్రుల ఆలనాపాలన కుమారులకు బరువవుతోంది. తాజాగా హైదరాబాద్​లోని ఓ విశ్రాంత ఉద్యోగికి చెప్పుకోవడానికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జీవిత భాగస్వామి.. మనవలు.. మనవరాళ్లు.. అందరూ ఉన్నా ఆదరించే వారు లేక.. ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా బతుకుతున్నాడు. కానీ ఆ పెద్దాయనకు ఏం అనిపించిందో ఏమో.. జీవితంపై విరక్తి చెందిన ఆయన మంగళవారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ వృద్ధుడి ఆత్మహత్య ఘటన ఇటీవల మానవ సంబంధాలపై ఊరూరా ప్రదర్శితమవుతున్న ‘బలగం’ సినిమాను తలపిస్తోంది.

వివరాల్లోకి వెళితే..హయత్‌నగర్‌ మండలం మునగనూరుకు చెందిన మల్లెల మల్లేష్(63) ఉస్మానియా ఆసుపత్రిలో అటెండర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యతో సహా ఎవరికి వారు వెళ్లిపోయారు. ఆదరించే వారు లేక.. అనారోగ్య సమస్యలూ తోడై ఒంటరిగా నాగోల్‌ డివిజన్‌ ఆనంద్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నారు.

మంగళవారం వంట చేసేందుకు పని మనిషి వచ్చి చూసే సరికి మల్లేష్‌ తన పడక గదిలో ఉరి వేసుకొని ఉండటంతో షాక్‌కు గురైంది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చి చూడగా అప్పటికే ఆయన మృతి చెందాడు. ఎల్బీనగర్‌ ఎస్సై లింగారెడ్డి వివరాలు నమోదు చేసుకునేందుకు సంఘటన స్థలానికి వచ్చారు. కేసు నమోదుకు సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలుండటంతో మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని ఎస్సై ఆదేశించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details