తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో రేపే పురపోరు ఓట్ల లెక్కింపు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ - ap news

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ నెల 10న.. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కార్పొరేషన్లలో 57.41 శాతం, మున్సిపాలిటీల్లో 70.65 శాతం ఓటింగ్ శాతం నమోదైంది.

ఏపీలో రేపే పురపోరు ఓట్ల లెక్కింపు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ
ఏపీలో రేపే పురపోరు ఓట్ల లెక్కింపు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

By

Published : Mar 13, 2021, 4:16 PM IST

ఏపీలో ఈ నెల 10న జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి.. ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏర్పాట్లపై నోడల్‌ అధికారులు, పోలీసులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్‌ సిబ్బంది, పోటీలోని అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు, అధికారులకు సంబంధించిన సూచనలు చేశారు.

ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. 11 నగరపాలిక, 70 పురపాలికల్లో ఎన్నికైన ఓట్లను లెక్కిస్తారు. హైకోర్టు ఉత్తర్వులతో ఏలూరు, చిలకలూరిపేట నగరపాలికల్లో లెక్కింపు నిలిపివేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్​ అమలు చేయనున్నారు. నగరపాలికల్లో లెక్కింపు కోసం 2,204 టేబుళ్లు, పురపాలక, నగర పంచాయతీల్లో 1,822 టేబుళ్లు కలిపి మొత్తం 4,026 టేబుళ్లను ఏర్పాటు చేశారు.

నగరపాలికల్లో 2,376 మంది సూపర్‌వైజర్లు, 7,412 మంది లెక్కింపు సిబ్బంది, పురపాలికల్లో 1,941 మంది సూపర్‌వైజర్లు, 5,195 మంది లెక్కింపు సిబ్బందిని నియమించారు. లెక్కింపు కేంద్రాల వద్ద 20,419 పోలీసు సిబ్బందిని నియమించారు. 172 మంది డీఎస్పీలు, 476 మంది సిఐలు, 1,345 మంది ఎస్‌.ఐ.లు, 17,292 మంది కానిస్టేబుల్.. 1,134 మంది ఇతర భద్రతా సిబ్బందిని ఎస్​ఈసీ నియమించింది.

ఓట్ల లెక్కింపు సిబ్బంది, ఏజెంట్లు అందరూ నిర్ణీత సమయానికి సంబంధిత లెక్కింపు కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద మెడికల్‌ క్యాంపులు, కొవిడ్‌ నియంత్రణ చర్యలు, మాస్కులు ధరించి మాత్రమే కౌంటింగ్‌ కేంద్రాలకు హాజరయ్యేలా ఆదేశాలు ఇస్తున్నారు. సిబ్బంది కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితాలకు సమయం దగ్గర పడుతుండడంపై.. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో.. ఉత్కంఠ పెరుగుతోంది. గెలుపుపై ధీమాగా ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం.. ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. మరోవైపు.. పోలీసులు కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత మోహరిస్తున్నారు.

ఇదీ చదవండి:'ఓటేయడానికొచ్చేవారు ఈ నిబంధనలు పాటించండి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details