హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చే సందర్శకులపై బల్దియా పాక్షిక ఆంక్షలు విధించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కార్యాలయానికి ఉదయం నుంచే కార్యాలయ వేళల్లో పెద్ద ఎత్తున వివిధ పనుల నిమిత్తం వస్తున్నారని.. రాష్ట్రంతో పాటు నగరంలో పెద్దఎత్తున కొత్త కేసులు నమోదవుతున్నందున కార్యాలయానికి వచ్చే సందర్శకులపై ఆంక్షలు విధిస్తున్నట్టు గ్రేటర్ అధికారులు స్పష్టం చేశారు.
ప్రజాశ్రేయస్సు కోసం ఆంక్షలు...
ఇప్పటికే జీహెచ్ఎంసీలోని పలు విభాగాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా అధికారులు, సిబ్బంది, సాధారణ ప్రజానికం శ్రేయస్సు కోసం ఆంక్షలు ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది కూడా కచ్చితంగా కొవిడ్ నియమ నిబంధనలు పాటించాలని, భౌతిక దూరం, మాస్క్‌లను ధరించడం, హ్యాండ్ వాష్ విధిగా చేసుకోవాలని సూచించారు.