హైదరాబాద్ కాచిగూడలో హంద్రీ ఎక్స్ప్రెస్, ఎంఎంటీఎస్ రైలు ప్రమాద ఘటన తర్వాత రైల్వే శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పునరుద్ధరణ పనులు వేగవంతమయ్యాయి. ఘటనాస్థలిని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానంద్ మాల్య , డీఆర్ఎం, దిల్లీ నుంచి వచ్చిన రైల్వేబోర్డు సభ్యులు సందర్శించారు.
మెకానికల్, ఎలక్ట్రీషియన్, సివిల్ ఇంజనీర్లు, ట్రాఫిక్ వంటి వివిధ విభాగాల నుంచి దాదాపు ఆరు వందల మంది సిబ్బంది పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. నాలుగు ఎంఎంటీఎస్ బోగీలు, హంద్రీ ఎక్స్ప్రెస్లో ఒక బోగి దెబ్బతిన్నాయని ఎస్సీఆర్ జీఎం గజానంద్ మాల్య తెలిపారు. మరో ఇంజన్ సాయంతో ప్రమాదానికి గురైన ఇంజన్ను ఎంఎంటీఎస్ బోగి నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.