తెలంగాణ

telangana

ETV Bharat / state

గుంటూరు మెకానిక్​కు చదలవాడ శ్రీనివాసరావు ఆర్థిక సాయం

ఏపీలోని గుంటూరులో కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన సురేశ్​ అనే ఏసీ మెకానిక్ ఐదేళ్ల క్రితం భవనంపై నుంచి పడటంతో రెండు కాళ్లు పని చేయటం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అతని దయనీయ పరిస్థితిపై ఈటీవీలో కథనం ప్రసారమైంది. దీనిని చూసి స్పందించిన దాతలు అతనికి ఆర్థిక సహాయం అందించారు.

guntur, response to etv story
గుంటూరు, ఈటీవీ కథనానికి స్పందన

By

Published : Jan 31, 2021, 11:47 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరులో కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన సురేశ్ అనే వ్యక్తి మెకానిక్​గా పనిచేసేవాడు. ఐదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో అతని కాళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో అతను ఏ పని చేసే పరిస్థితి లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావటంతో .. అతని వైద్యానికి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఈటీవీ కథనానికి స్పందన..

సురేశ్​ దయనీయ పరిస్థితిపై ఈటీవీలో ఈనెల 28న కథనం ప్రసారమైంది. అది చూసిన హైదరాబాద్​కు చెందిన వ్యాపారవేత్త చదలవాడ శ్రీనివాసరావు వెంటనే స్పందించారు. ఈటీవీ ప్రతినిధులతో మాట్లాడి.. తన వంతుగా సురేశ్​కు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. లక్ష రూపాయలు ఆర్థిక సాయం పంపించారు. గుంటూరులోని ఈటీవీ ప్రతినిధి.. సురేశ్​ ఇంటికి వెళ్లి ఆ సాయాన్ని అందజేశారు. వీడియో కాల్ ద్వారా చదలవాడ శ్రీనివాసరావుతో సురేశ్​ మాట్లాడారు. అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఏదైనా వ్యాపారం చేసుకోవాలని సూచించారు. అలాగే అతని కుమార్తె విద్యాభ్యాసానికి కూడా సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన శ్రీనివాసరావుకు సురేశ్​ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాకు చెందిన బంగారు నగల వ్యాపారి బషీర్ కూడా తన వంతుగా రూ. 10వేలు సాయం చేశారు. సురేశ్​ పరిస్థితిని తెలియజేసి... అతనికి సాయమందేలా చేసిన ఈటీవీకి వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:ఇంటర్‌ సప్లిమెంటరీ ఉండదు...

ABOUT THE AUTHOR

...view details