కరోనా వేళ జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించాలని ఇచ్చిన వినతిని పరిష్కరించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్, మే నెలల్లో ఇచ్చిన వినతిపత్రాన్ని పట్టించుకోకపోవడంపై సత్యనారాయణ అనే పాత్రికేయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాదులకు రూ. 25 కోట్ల సాయం అందించినట్టే తమకు ఇవ్వాలని పాత్రికేయులు గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పాత్రికేయుల విజ్ఞప్తిని పరిష్కరించండి... ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - పాత్రికేయుల విజ్ఞప్తిని పరిశీలించాలన్న హైకోర్టు
కరోనా సమయంలో పాత్రికేయులకు ఆర్థిక సాయం అందించాలని ఇచ్చిన వినతిని పరిష్కరించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
![పాత్రికేయుల విజ్ఞప్తిని పరిష్కరించండి... ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం Resolve the appeal of journalists says Highcourt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7883958-773-7883958-1593810342064.jpg)
పాత్రికేయుల విజ్ఞప్తిని పరిష్కరించండి... ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం