ఆంధ్రా విశాఖలో పెను విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. ఎల్జీ పాలిమర్స్ ను అక్కడి నుంచి తరలించాలని నినాదాలు చేస్తూ పరిశ్రమ వద్ద ధర్నాకు దిగారు.
కంపెనీతో కుమ్మక్కై తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు వెంకటాపురం గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా వాహనాల్లో ఎక్కించి అక్కడ్నుంచి తరలించారు.
ఓ వైపు స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా.. పరిశ్రమకు సమీపంలోని వెంకటాపురం గ్రామస్థులు భారీగా తరలివస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యువకులను అరెస్టు చేసే క్రమంలో వారు ప్రతిఘటించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భారీగా చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు.
ఎల్జీ పాలిమర్స్‌ను మూసివేయాలి