తెలంగాణ

telangana

తిరుమలలో భారీ వర్షం .. నిండిన జలాశయాలు

By

Published : Nov 26, 2020, 7:30 PM IST

నివర్ ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. వానల వల్ల కొండపై ఉన్న జలాశయాలన్నీ నిండిపోయాయి. గేట్లెత్తి అధికారులు నీటిని కిందికి వదులుతున్నారు.

reservoirs
తిరుమలలో భారీ వర్షం .. నిండిన జలాశయాలు

తిరుమలలో గత రెండు రోజులుగా కురుస్తున్న వానతో జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. తిరుమల కొండపై ఉన్న ఐదు జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. కుమారధార, పసుపుధార జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. పాపవినాశనం జలాశయం గేట్లు బుధవారం సాయంత్రం నుంచి తెరిచి ఉంచారు.

గో గర్భం జలాశయానికి అటవీ ప్రాంతం నుంచి భారీగా వరద చేరుతోంది. ఆకాశ గంగ జలాశయం కూడా పూర్తిగా నిండిపోయింది. జలాశయాల గేట్లు తెరవడం, కొండపై కురుస్తున్న వర్షంతో దిగువ ప్రాంతానికి భారీ వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో తిరుపతిలో అధికారులు అప్రమత్తమయ్యారు.

తిరుమలలో భారీ వర్షం .. నిండిన జలాశయాలు

ఇదీ చూడండి:'పోస్టర్​ బ్యాలెట్​ ఛార్జీలు జీహెచ్​ఎంసీనే చెల్లిస్తుంది'

ABOUT THE AUTHOR

...view details