తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆనందయ్య కరోనా మందు పనితీరుపై.. పరిశోధన ప్రారంభం - ఆనందయ్య ఆయుర్వేదం రీసెర్చ్

ఏపీలోని కృష్ణపట్నం ఆనందయ్య మందు పనితీరుపై పరిశోధన ప్రారంభమైంది. దీనిపై సీసీఆర్‌ఏఎస్‌ 4 దశల్లో పరిశోధన, విశ్లేషణ జరుపనుంది. మొదటి దశలో భాగంగా మందు తీసుకున్న వారి నుంచి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్‌ అభిప్రాయాలు సేకరించనుంది.

research-started-for-anandhayya-medicine
ఆనందయ్య కరోనా మందు పనితీరుపై.. పరిశోధన ప్రారంభం

By

Published : May 24, 2021, 12:42 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు పనితీరుపై పరిశోధన ప్రారంభమైంది. 4 దశల్లో పరిశోధన, విశ్లేషణ జరపనున్నారు. మొదటి దశలో భాగంగా మందు తీసుకున్న వారి నుంచి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్‌ (సీసీఆర్‌ఏఎస్‌) అభిప్రాయాలు సేకరిస్తోంది. మందు తీసుకున్న వారి ఫోన్‌ నెంబర్లను పోలీసులు సేకరించారు. 500 మందికి ఫోన్‌ చేసి ఆయుర్వేద వైద్యులు ఆరోగ్య వివరాలు తెలుసుకోనున్నారు.

కరోనా పరీక్షల నివేదిక, మందు వేయించుకున్నప్పటి పరిస్థితిపై ఆరా తీస్తారు. మందు వేసుకున్న తర్వాత పరిస్థితులు, ప్రస్తుత వైద్య నివేదికలపై వివరాలు తెలుసుకోనున్నారు. వివరాల సేకరణకు విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన స్థానానికి, తిరుపతి ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రికి సీసీఆర్‌ఏఎస్‌ బాధ్యతలు ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌ ప్రొఫార్మాలో ఆయుర్వేద వైద్యులు వివరాలు పొందుపరచనున్నారు. రెండ్రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని వైద్యులను సీసీఆర్ఏఎస్ ఆదేశించింది. మందు ప్రభావం విశ్లేషణ ద్వారా సీసీఆర్ఏఎస్ ప్రాథమిక నిర్ధారణకు రానుంది.

ఇదీ చదవండి:ఆనందయ్య మందు పంపిణీకి అభ్యంతరం లేదు: సింఘాల్

ABOUT THE AUTHOR

...view details