తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇదే చివరి అవకాశం.. - real

స్థిరాస్తి వ్యాపారులు రెండు లక్షల రూపాయల అపరాధ రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రెరా.. ఈ నెలాఖరు వరకు గడువిచ్చింది.

రెరా

By

Published : Feb 14, 2019, 5:51 AM IST

రెరా స్థిరాస్తి నమోదు
రెండు లక్షల రూపాయల అపరాధ రుసుంతో స్థిరాస్తి ప్రాజెక్టులను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రాష్ట్ర స్థిరాస్తి క్రమబద్ధీకరణ, అభివృద్ధి సంస్థ ఈనెల 28 వరకు గడువును పొడిగించింది. గడువు ముగుస్తున్నా.. వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఈ మేరకు గడువు తేదీ పొడిగించినట్లు రెరా ఛైర్మన్ రాజేశ్వర్ తివారి తెలిపారు. ఈ మొత్తం చెల్లించనట్లయితే తర్వాత విధించే జరిమానాలు భారీగా ఉంటాయని హెచ్చరించారు. 2017 జనవరి నుంచి 2018 ఆగస్టు మధ్య భవన నిర్మాణ అనుమతి పొందిన స్థిరాస్తి ప్రాజెక్టులు రూ. 2లక్షల అపరాధ రుసుము చెల్లించి ఈ నెలలోపు రిజిష్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details