రాష్ట్రంలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇవ్వాలని రాష్ట్రంలోని సినిమా హాళ్ల యాజమాన్యం డిమాండ్ చేసింది. గతంలో వసూలు చేసిన నామినల్ ఛార్జీలనే తీసుకుంటామని.. పలువురు థియేటర్ల యజమానులు ప్రభుత్వాన్ని కోరారు.
మల్టీఫ్లెక్స్ థియేటర్లలో ఎవరో చేసిన తప్పునకు రెండేళ్లుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు పూర్తిగా నష్టపోయాయని.. తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో సమావేశమై తమ డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించారు.