Republic day Celebrations in RFC దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలోనూ 74వ రిపబ్లిక్ డే వేడుకలు వైభవంగా జరిగాయి. మువ్వెన్నల జాతీయ పతాకాన్ని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఆవిష్కరించారు. అనంతరం భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అందరికీ ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్‌ఎఫ్‌సీలో మువ్వెన్నల జెండాను ఎగరేసిన రామోజీరావు - రామోజీ రావు తాజా వార్తలు
Republic day Celebrations in RFC భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశమంతా త్రివర్ణ శోభితంగా మారింది. ఇక ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలోనూ రిపబ్లిక్ డే వేడుకలు వైభవంగా జరిగాయి. మువ్వెన్నల జాతీయ పతాకాన్ని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఆవిష్కరించారు.
ఆర్‌ఎఫ్‌సీలో మువ్వెన్నల జెండాను ఎగరేసిన రామోజీరావు
ఈ కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, రామోజీ గ్రూపు సంస్థల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పలువురు ఉన్నత ఉద్యోగులు, సిబ్బంది వేడుకలకు హాజరయ్యారు. ఇక రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రతి ఏడాది స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకల్లో రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, తదితర సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు.
ఇవీ చూడండి: