సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి జెండాను ఎగురవేశారు. పాలకులు మారుతున్నారు కానీ... రాజ్యాంగం మాత్రం అనేక ఆటుపోట్లకు గురవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
సీపీఐ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు - Republic Day 2021
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి జెండాను ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
సీపీఐ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తుందని అన్నారు. దేశంలో దిల్లీ నుంచి గల్లీ దాకా రైతుల ఆందోళన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత వ్యవసాయ చట్టాలపై ఎందుకు మాట మార్చారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు.