గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లోకేశ్‌కుమార్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు - Republic Day celebrations
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. కమిషనర్ లోకేశ్‌కుమార్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
జాతీయ జెండా ఆవిష్కరణకు ముందు పోలీసు గౌరవ వందనాన్ని కమిషనర్ స్వీకరించారు. కరోనా నిబంధనలతో జరిగిన ఈ గణతంత్ర వేడుకలు కొత్తపాలక మండలికి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో ఏ విధమైన సందేశాలు లేకుండానే ముగిశాయి.