హైదరాబాద్ నగరాన్ని పచ్చదనం, పరిశుభ్రతతో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నిర్మాణాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోందని డిప్యూటీ మేయర్ శ్రీలత తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని మూసీ పరివాహక ముంపు ప్రాంతాల్లో పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె పర్యటించారు. సీఎం కేసీఆర్ చొరవతో.. ముంపు ప్రాంతాల పరిరక్షణ కోసం ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు.
ఆయా ప్రాంతాల ప్రజలు.. ప్రజాప్రతినిధులకు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. వానాకాలంలో తమ ఇళ్లల్లోకి వరద నీటితో పాటు పాములు, క్రిమికీటకాలు వస్తుంటాయని వాపోయారు. సమస్యలపై స్పందించిన డిప్యూటీ మేయర్.. ఈ సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.