తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ - కోవిడ్ -19 తాజా వార్తలు

లాక్​డౌన్​లో సమయంలో అవిరామంగా సేవలందిస్తోన్న పోలీసులకు ఓ స్వచ్ఛంద సంస్థ తన వంతు సాయం చేసింది. కరోనా కట్టడి చర్యల్లో విశేష కృషి చేస్తున్న పోలీసులకు సేవా భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.

Seva Bharathi charity, who distributed masks and sanitizers
పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ

By

Published : Apr 9, 2020, 12:27 AM IST

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా అవిశ్రాంతిగా పనిచేస్తున్న పోలీసులకు సేవా భారతి స్వచ్ఛంద సంస్థ రక్షణ పరికరాలు పంపిణీ చేసింది. సంస్థ అధినేత భారతి ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ప్రతి పోలీస్​ స్టేషన్​లో మాస్కులు, శానిటైజర్లు అందించారు.

పురానాపుల్​లోని పోలీస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్​లో శిక్షణ పొందుతున్న 200 మంది సివిల్ కానిస్టేబుల్స్​కు మాస్క్​లు, శానిటైజర్లు అందజేశారు. ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చదవండి:కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి

ABOUT THE AUTHOR

...view details