హైదరాబాద్ కేంద్రంగా తమ నూతన ఏవియేషన్ డిజైన్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని కెనడాకు చెందిన రెవిన్ ఏవియేషన్ ప్రకటించింది. ఎస్పీ10ఎంగా పిలిచే... టెన్ ప్లస్ టూ పైలట్ సీటర్ మినీ ప్లెయిన్ డబుల్ టర్బో ఇంజిన్తో పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. వింగ్స్ ఇండియా-2020 ఏవియేషన్ షోలో పాల్గొన్న కంపెనీ ప్రతినిధులు తమ ప్రణాళికలను వివరించారు.
"హైదరాబాద్లో రెవిన్ ఏవియేషన్ డిజైన్ సెంటర్" - హైదరాబాద్లో ఏవియేషన్ డిజైన్ సెంటర్ ఏర్పాటు
కెనడాకు చెందిన రెవిన్ ఏవియేషన్ హైదరాబాద్ కేంద్రంగా తమ నూతన ఏవియేషన్ డిజైన్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. బేగంపేట ఎయిర్ పోర్టులో జరుగుతున్న వింగ్స్ ఇండియా ఏవియేషన్ షోలో పాల్గొన్న కంపెనీ ప్రతినిధులు తమ నూతన టెన్ సీటర్ సీ - ప్లెయిన్ గురించిన ప్రణాళికలను వివరించారు.
"హైదరాబాద్లో రెవిన్ ఏవియేషన్ డిజైన్ సెంటర్"
వీఐపీలకు, రెస్క్యూ ఆపరేషన్, సరకు రవాణాకు సౌకర్యవంతంగా ఉంటుందని ప్రకటించింది. సముద్రం, సరస్సు, భూతలం రన్ వేలపై టేక్ ఆఫ్, ల్యాండ్ చేయటం దీని ప్రత్యేకతని తెలిపింది.