తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్‌లో నుమాయిష్.. ఏర్పాటు చేయాలని ఎగ్జిబిషన్‌ సొసైటీ సన్నాహాలు - గంగులతో సమావేశమైన ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు

Numaish in Karimnagar: నుమాయిష్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు హైదరాబాద్. కానీ ఇప్పుడు కరీంనగర్​లో కూడా నుమాయిష్​ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్, వినోద్ కుమార్‌తో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు కలిసి నిర్వహణ విషయమై చర్చించారు.

Numaish in Karimnagar
Numaish in Karimnagar

By

Published : Oct 12, 2022, 4:01 PM IST

Numaish in Karimnagar: హైదరాబాద్​లో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్​ను తొలిసారి నగరం వెలుపల కరీంనగర్​లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్​తో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు కలిశారు. ఈ విషయమై చర్చించారు. 82 ఏళ్ల చరిత్ర కలిగిన నుమాయిష్​ను ఇప్పటి వరకూ హైదరాబాద్​లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో మాత్రమే నిర్వహిస్తున్నారు.

చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల.. ఈ ఎగ్జిబిషన్​ను కరీంనగర్​లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతూ తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్, ఐటీ టవర్స్ వంటి ఇతర పనులతో ఎదుగుతున్న కరీంనగర్​లో నుమాయిష్ నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులను గతంలో కోరారు.

రానున్న జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు హైదరాబాద్​ ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో 82వ నుమాయిష్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కరీంనగర్​లో నిర్వహించే విషయమై ఈ సమావేశంలో చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details