ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఈనెల 19న విచారణకు హాజరు కావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. ప్రజా ప్రతినిధుల కోర్టులో శుక్రవారం... వేర్వేరు కేసుల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి హాజరయ్యారు.
భట్టి విక్రమార్కకు ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు - తెలంగాణ వార్తలు
ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఈనెల 19న విచారణకు హాజరు కావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. భట్టి విక్రమార్కకు వాట్సప్, మెయిల్ ద్వారా సమన్లు పంపేందుకు ముదిగొండ పోలీసులకు న్యాయస్థానం అనుమతినిచ్చింది.
![భట్టి విక్రమార్కకు ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు భట్టి విక్రమార్కకు ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10602273-thumbnail-3x2-batti-rk.jpg)
భట్టి విక్రమార్కకు ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు
మహబూబ్నగర్లో గతంలో నమోదైన ఎన్నికల నియామళి ఉల్లంఘన కేసులో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తదితరులపై కేసును ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.
ఇదీ చూడండి:మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలను గద్దె దించుదాం: రేవంత్రెడ్డి