టీఆర్టీ 2017లో ఖాళీగా ఉన్న 530 ఉర్దూ మీడియం టీచర్ పోస్టులను డి-రిజర్వ్ చేసి భర్తీ చేయాలని... తెలంగాణ ఉర్దూ ట్రైయిన్డ్ టీచర్స్ అసోసియేషన్ కోరింది. హైదరాబాద్ అబీడ్స్లోని మీడియా ప్లస్ సెంటర్ లో నిర్వహించిన సమావేశంలో ఉర్దూ టీచర్లు పాల్గొన్నారు.
530 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా 2017లో 900 ఉర్దూ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసిందని... అందులో 370 పోస్టులను మాత్రమే భర్తీ చేసిందని వారు తెలిపారు. రిజర్వ్డ్ అభ్యర్థులు లేకపోవడం వల్ల 530 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయని పేర్కొన్నారు.
విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు..
ఇతర శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులకు డి రిజర్వ్ ద్వారా మిగిలిన మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం పై గత మూడేళ్లుగా అధికారులు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో టీచర్లు లేక ఉర్దూ మీడియం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో రెండవ అధికార భాషగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఖాళీలను భర్తీ చేయాలేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:రెండు వాహనాలు ఢీ-10 మంది మృతి