తెలంగాణ

telangana

ETV Bharat / state

సరికొత్త దారుల్లో.. సురక్షితంగా సాగిపోదాం! - రోడ్ల పనులు

లాక్‌డౌన్‌తో 15 రోజుల్లోనే చాలా రోడ్ల పనులు పూర్తైయ్యాయి. 709కి.మీ రహదారులపై పాలిమర్‌ తారు వేశారు. భాగ్యనగర వీధుల్లో నాణ్యతపెరగనుంది తద్వారా వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం అందనుందని రోడ్డు భవనాల ఇంజినీరింగ్​ విభాగం వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

repairing roads in Hyderabad ghmc officers
సరికొత్త దారుల్లో.. సురక్షితంగా సాగిపోదాం!

By

Published : Apr 17, 2020, 10:28 AM IST

భాగ్యనగరంలో సరికొత్త నాణ్యమైన, దీర్ఘకాల మన్నికగల రహదారులు సాకారం కాబోతున్నాయి. పెద్దఎత్తున నగర రహదారులు పాలిమర్‌ మాడిఫైడ్‌ బిటుమిన్‌(పీఎంబీ) పొరతో బలోపేతం అవుతున్నాయి. ప్లాస్టిక్‌తో తయారైన ఆ తారు మిశ్రమాన్ని రోడ్డుపై రెండో పొరగా వేయనున్నామని, పలుచని పీఎంబీ పొర రహదారిని నీటి నిల్వల నుంచి రక్షిస్తుందని ఇంజినీరింగ్‌ విభాగం ధీమా వ్యక్తం చేస్తోంది. నగరంలో ఇప్పటి వరకు పాలిమర్‌ రోడ్ల నిర్మాణం ప్రయోగాత్మకంగా జరిగింది. సాధారణ తారుతో పోలిస్తే ఈ తరహా మిశ్రమం ధర ఎక్కువగా ఉండటం వల్ల అధికారులు కొన్ని ప్రాంతాలకే వాటిని పరిమితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా రోడ్లను దీర్ఘకాలం మన్నేలా తీర్చిదిద్దాలని ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఒకేసారి భారీస్థాయిలో పీఎంబీ వినియోగానికి సిద్ధమైంది.

నిర్మానుష్య రోడ్లపై నిరాటంకంగా..

హైదరాబాద్‌ మహానగరంలో 9,100 కి.మీటర్ల మేర రోడ్లున్నాయి. వాటిలో 709 కి.మీ రోడ్లను జీహెచ్‌ఎంసీ సమగ్ర రహదారుల నిర్వహణ(సీఆర్‌ఎంపీ) కింద ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చింది. ఐదేళ్లపాటు నిర్వహణ చూడనున్న ఆ ఏజెన్సీలు జోన్లవారీగా జనవరిలో రహదారి నిర్మాణ పనులు ప్రారంభించాయి. వాహనాలతో కిక్కిరిసి ఉండే రోడ్లపై మరమ్మతులు చేపట్టలేక.. ఏజెన్సీలు మార్చి వరకు పెద్దగా పురోగతి చూపించలేకపోయాయి. మార్చి 23న రాష్ట్ర సర్కారు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ ప్రకటించగా.. ఆ సమయంలో యంత్రాలను ఎక్కువగా ఉపయోగించి రోడ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు జీహెచ్‌ఎంసీ రంగంలోకి దిగింది. నిర్మానుష్యంగా మారిన రోడ్లపై నిరాటంకంగా పనులు చేసింది. గడచిన రెండు వారాల్లో చాలా పనులను పూర్తి చేసింది. సైబర్‌టవర్స్‌ కూడలిని వీడీసీసీ కాంక్రీటుతో అభివృద్ధి చేశామని ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు.

సరికొత్త దారుల్లో.. సురక్షితంగా సాగిపోదాం!

సీఆర్‌ఎంపీ పథకం కింద చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఏజెన్సీలు 709 కి.మీ రోడ్లను అభివృద్ధి చేస్తున్నాయి. వాటి పనులు పూర్తయ్యాక ఆయా రోడ్లలోని బీటీ రోడ్లపై పాలిమర్‌ బిటుమిన్‌ను ఓ పొర మేర వేయాలని నిర్ణయించాం. దానికయ్యే వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ భరిస్తుంది. తక్కువ సిబ్బందితో సీసీ రోడ్లు, వీడీసీసీ రోడ్లు నిర్మిస్తున్నాం. పనుల దగ్గర భౌతిక దూరాన్ని పాటిస్తున్నామని ముఖ్య ఇంజినీర్​ జియాఉద్దీన్ తెలిపారు.

సరికొత్త దారుల్లో.. సురక్షితంగా సాగిపోదాం!

ఇదీ చూడండి:సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!

ABOUT THE AUTHOR

...view details