తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజధాని పోలీసింగ్‌కు కొత్త ముఖచిత్రం.. జనాభా పెరుగుదలకు అనుగుణంగా కొత్త ఠాణాలు - హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసు

New Police Stations in Hyderabad : కొత్త ఏడాదిలో భాగ్యనగర పోలీసింగ్‌ కొత్త రూపు సంతరించుకోనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఏటా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్‌ వ్యవస్థను తీర్చిదిద్దే పనిలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే కొత్తగా జోన్లు, డివిజన్లు, ఠాణాల పెంపుపై దృష్టి సారించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇవి ఆమోదం పొందడం లాంఛనమే కావడంతో.. కొత్తగా 23 పోలీస్‌ స్టేషన్లు రానున్నాయి.

Hyderabad Police
Hyderabad Police

By

Published : Dec 25, 2022, 9:46 AM IST

భాగ్యనగరంలో కొత్తగా 23 పోలీస్​ స్టేషన్లు.. ప్రారంభం ఎప్పుడంటే..!!

New Police Stations in Hyderabad : పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా.. భాగ్యనగర పరిధిలోని మూడు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ తుది దశకు చేరుకుంది. కొత్త ఠాణాలు రావడంతో పాలనాపరమైన అంశాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్తగా జోన్లు, డివిజన్లు, ఠాణాల పెంపుపై దృష్టి సారించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో 1,252.. సైబరాబాద్‌లో 648.. రాచకొండలో 748 కొత్త పోస్టుల మంజూరుకు ఇటీవలే మంత్రివర్గం ఆమోదం లభించడంతో కార్యాలయాల పెంపు ప్రతిపాదనలకు అనుమతి లభించడం లాంఛనప్రాయమే కానుంది.

అన్నీ కుదిరితే స్వల్ప మార్పులు మినహా కొత్త సంవత్సరం ఆరంభం నుంచే గ్రేటర్‌ హైదరాబాద్‌ పోలీసింగ్‌ సరికొత్త రూపం సంతరించుకోనుంది. కొత్తగా 23 పోలీస్‌ స్టేషన్లు రానున్నాయి. కీలకమైన హైదరాబాద్‌ కమిషనరేట్‌లో శాంతిభద్రతల విభాగంలోని సౌత్‌, వెస్ట్‌ జోన్ల స్వరూపం మారనుంది. ఈ రెండు జోన్లలో నుంచి కొన్ని ఠాణాలతో కొత్తగా సౌత్‌ ఈస్ట్‌, సౌత్‌ వెస్ట్‌ పేరుతో రెండు జోన్లు రానున్నాయి. అలాగే కొత్తగా డివిజన్లు రానున్నాయి.

Hyderabad City Police Zones : సెంట్రల్‌ జోన్‌లో గాంధీనగర్‌.. ఈస్ట్‌ జోన్‌లో అంబర్‌పేట, చిలకలగూడ, ఉస్మానియా యూనివర్సిటీ.. నార్త్‌ జోన్‌లో తిరుమలగిరి.. సౌత్‌ ఈస్ట్‌ జోన్‌లో చాంద్రాయణగుట్ట, సైదాబాద్‌.. సౌత్‌ వెస్ట్‌ జోన్‌లో గోల్కొండ, కుల్సుంపుర.. సౌత్‌ జోన్‌లో బహుదూర్‌పుర.. వెస్ట్‌ జోన్‌లో జూబ్లీహిల్స్‌ ఉండనున్నాయి. అలాగే 14 కొత్త ఠాణాలు వస్తాయి. ఇక సైబరాబాద్‌ కమిషనరేట్‌లో శాంతి భద్రతలు, ట్రాఫిక్‌ విభాగాల్లో కొత్తగా మేడ్చల్‌, రాజేంద్రనగర్‌ జోన్లు అవతరించబోతున్నాయి.

బాలానగర్‌ నుంచి విడిపోయి మేడ్చల్‌ జోన్‌... శంషాబాద్‌ నుంచి విడిపోయి రాజేంద్రనగర్‌ జోన్‌ ఏర్పాటు కానుంది. కూకట్‌పల్లి డివిజన్‌ను మాదాపూర్‌ జోన్‌ నుంచి బాలానగర్‌ జోన్‌కు మార్చనున్నారు. మేడ్చల్‌ శాంతి భద్రతల జోన్‌లో మేడ్చల్‌, పేట్‌ బషీరాబాద్‌ డివిజన్లు ఉండనున్నాయి. రాజేంద్రనగర్‌ జోన్‌లో రాజేంద్రనగర్‌, చేవెళ్ల డివిజన్లు రానున్నాయి. నాలుగు కొత్త పోలీస్‌ స్టేషన్లు రానున్నాయి. రాచకొండ కమిషనరేట్‌కు ప్రస్తుతం శాంతిభద్రతల విభాగంలో ఒక జాయింట్‌ కమిషనర్‌ పోస్టు ఉంది.

Hyderabad Traffic Police: కొత్తగా ట్రాఫిక్‌ విభాగానికి కూడా ఈ పోస్టు ప్రతిపాదించారు. ఇక్కడ మహేశ్వరం జోన్‌ ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇది ఎల్బీనగర్‌ జోన్‌ పరిధిలో ఉంది. ప్రస్తుతం కమిషనరేట్‌లో మొత్తానికి ఒకే ట్రాఫిక్‌ జోన్‌ ఉంది. దీన్ని రెండుగా విభజించనున్నారు. మల్కాజిగిరి - భువనగిరి ట్రాఫిక్‌ జోన్‌తో పాటు ఎల్బీనగర్​ - మహేశ్వరం జోన్‌ ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ఎస్​ఓటీ జోన్‌ ఒకటే ఉంది. దీన్ని విభజించి ఎల్బీనగర్​ - మహేశ్వరం, మల్కాజిగిరి - భువనగిరి జోన్‌లను ఏర్పాటు చేయనున్నారు. మహేశ్వరం, శాంతి భద్రతల విభాగంలో యాదగిరిగుట్ట టెంపుల్‌, ట్రాఫిక్‌లో మహేశ్వరం డివిజన్లను ప్రతిపాదించారు. కొత్తగా ఎల్బీనగర్​ - మహేశ్వరం.. మల్కాజిగిరి - భువనగిరి ఎస్​ఓటీ డివిజన్లు రానున్నాయి. కొత్తగా 5 పోలీస్‌ స్టేషన్లను ప్రతిపాదించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details