Rental Buses for TSRTC: తెలంగాణ ఆర్టీసీలో మరో 70 అద్దె బస్సులు పెరగనున్నాయి. ఆగస్టు నాటికి 3,107 అద్దెబస్సులు, 6,601 సొంత బస్సులు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లో 40, కరీంనగర్ జోన్ పరిధిలో 30 బస్సులను అద్దెకు తీసుకునేందుకు ప్రకటన జారీ చేశారు. ఈనెల 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు టెండర్ దాఖలు చేసేందుకు చివరి తేదీగా సంస్థ వెల్లడించింది.
Rental Buses for TSRTC: ఆసక్తి గల వారు దరఖాస్తు చేయొచ్చు... ఈ నెల 21 వరకు గడువు! - టెండర్ అద్దెబస్సులు
Rental Buses for TSRTC: అద్దె బస్సుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు కోరింది. టెండర్ దరఖాస్తు ఫారం, టెండర్ షెడ్యూల్ కొరకు టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి వివరాలు పొందవచ్చని తెలిపింది. డిసెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు టెండర్ దాఖలు చేయాలని కోరంది.
అద్దెబస్సులు
21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ ఓపెన్ చేస్తారు. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో అద్దె బస్సుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్టీసీ తెలిపింది. టెండర్ దరఖాస్తు ఫారం, టెండర్ షెడ్యూల్ కొరకు tsrtc.telangana.gov.in అనే వెబ్సైట్ నుంచి వివరాలు పొందవచ్చని ఆర్టీసీ తెలిపింది.
ఇదీ చూడండి:TSRTC: అద్దెబస్సులు కావలెను… ఈనెల 21 వరకు టెండర్ వేయొచ్చు