పెండింగ్‌లో ఉన్న అద్దె బస్సుల బిల్లులను వెంటనే చెల్లించాలని అద్దె బస్సుల యజమానులు ప్రగతిభవన్‌ను ముట్టడించారు. మార్చి నుంచి ఇప్పటివరకు నడిచిన బస్సులకు బిల్లులు ఇవ్వడం లేదని ఆందోళన నిర్వహించారు.
బకాయిలు చెల్లించాలని అద్దె బస్సుల యజమానుల నిరసన - pragathi bhavan hyderabad
గత మూడు నెళ్లుగా అద్దె బస్సులకు అద్దె చెల్లించడంలేదని ప్రగతిభవన్ ముందు నిరసన తెలిపేందుకు వచ్చిన అద్దె బస్సుల యజమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని డీసీఎంలలో గోశామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గత మూడు నెళ్లుగా పెండింగ్‌లో ఉన్న అద్దె బస్సుల బకాయిలు చెల్లించకపోవడంతో... తీవ్రంగా నష్టపోతున్నామంటున్న అద్దె బస్సుల యజమానులతో మా ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.
![బకాయిలు చెల్లించాలని అద్దె బస్సుల యజమానుల నిరసన rental-bus-owners-darna-at-pragathi-bhavan-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8187858-74-8187858-1595832874853.jpg)
బకాయిలు చెల్లించాలని అద్దె బస్సుల యజమానులు నిరసన
బకాయిలు చెల్లించాలని అద్దె బస్సుల యజమానులు నిరసన
తమ బస్సులకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3300 అద్దె బస్సులు ఉన్నాయన్నారు. ఆ బస్సులు నడపాలని, తమ బస్సులకు ఒప్పందం పొడిగించాలని కోరారు.
ఇదీ చూడండి :నకిలీ అధికారుల హల్చల్.. ఆట కట్టించిన గ్రామస్థులు!