తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫిబ్రవరి 10 లోపు రాష్ట్రానికి 1334 అద్దె బస్సులు - rent buses to come to telangana before February 10

తెలంగాణకు 1,334 అద్దె బస్సులు అందుబాటులోకి రానున్నట్లు ఆర్టీసీ ఈడీ యాదగిరి తెలిపారు. వికారాబాద్‌ పరిగి డిపో సందర్శించిన ఆయన వచ్చే నెల 10 లోపు బస్సులు రానున్నట్లు చెప్పారు.

rent buses to come to telangana before February 10
ఫిబ్రవరి 10 లోపు రాష్ట్రానికి 1334 అద్దె బస్సులు

By

Published : Jan 9, 2020, 6:14 AM IST

Updated : Jan 9, 2020, 8:31 AM IST

రాష్ట్రానికి వచ్చే నెల 10 లోపు 1,334 అద్దె బస్సులు అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇ.యాదగిరి తెలిపారు. బుధవారం వికారాబాద్‌ జిల్లా పరిగి డిపోను సందర్శించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం 11 రీజియన్ల పరిధిలో 97 డిపోల్లో 10,461 బస్సులు రోజూ 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయని, సగటున రూ.12 కోట్ల రాబడి వస్తోందని చెప్పారు. ఛార్జీల పెంపుతో రాబడి రూ.1.5 కోట్లు పెరిగిందని, మొత్తంగా సంస్థ రూ.400 కోట్ల నష్టాల్లో ఉందన్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో సంస్థను లాభాల్లోకి తీసుకువచ్చే క్రమంలో 97 డిపోలను సీనియర్‌ అధికారులు దత్తత తీసుకున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండిః చంద్రబాబును ఆయన నివాసానికి తరలించిన పోలీసులు

Last Updated : Jan 9, 2020, 8:31 AM IST

ABOUT THE AUTHOR

...view details