లాక్‌డౌన్ సడలింపు సమయం పొడిగించినందున ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని ఐదు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పని చేస్తాయని సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి బాలయ్య తెలిపారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, టోలిచౌకి, బేగంపేట, నిజామాబాద్‌లోని పాస్‌పోర్టు సేవాకేంద్రాలు, కరీంనగర్‌లోని లఘు కేంద్రం, సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయంలోని పబ్లిక్ విచారణ కౌంటర్లు, బ్రాంచ్ సెక్రటరీ కార్యాలయ సేవలు తిరిగి ప్రారంభించామన్నారు.
passport: ప్రారంభమైన పాస్‌పోర్టు సేవలు - తెలంగాణ వార్తలు
నేటి నుంచి పాస్‌పోర్టు సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పని చేస్తాయని సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి వెల్లడించారు. ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
పాస్‌పోర్టు సేవలు ప్రారంభం, పాస్‌పోర్టు కార్యాలయాలు ప్రారంభం
మే 12 నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లోకి రావడంతో పాస్‌పోర్టు సేవా కేంద్రాల సేవలు నిలిపివేశారు. ఇవాళ్టి నుంచి పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆర్పీవో బాలయ్య కోరారు.
ఇదీ చదవండి:LOAN APPS: సైబర్ పోలీసునంటూ రూ.1.18 కోట్లు స్వాహా