తెలంగాణ

telangana

ETV Bharat / state

Removal of footpaths: 'పుట్‌పాత్‌లు ఆక్రమిస్తే కఠిన చర్యలు'

Removal of footpaths: హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులపై ట్రాఫిక్ పోలీసులు కఠినచర్యలు తీసుకుంటున్నారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేయడం వల్ల పాదాచారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.

footpaths
footpaths

By

Published : Apr 5, 2022, 3:19 PM IST

Removal of footpaths: హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్‌లను అక్రమించిన చిరు వ్యాపారులపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మలక్‌పేట ప్రధాన రహదారి ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన చిన్న దుకాణాలను తొలగించారు. ఫుట్‌పాత్‌లను అక్రమించి చిరు వ్యాపారాలను నిర్వహించడం పట్ల పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఫుట్‌పాత్‌లను అక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. మలక్‌పేట్‌తోపాటు చాదర్‌ఘాట్‌, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా ఫుట్‌పాత్‌ అక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని మలక్‌పేట ట్రాఫిక్ సీఐ జోత్స్న తెలిపారు.

చిరువ్యాపారితో మాట్లాడుతున్న ట్రాఫిక్ పోలీస్

ABOUT THE AUTHOR

...view details