హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వర్షం ధాటికి వంటసామగ్రి, బట్టలు, పాత్రలు సైతం కోల్పోయి దయనీయ స్థితిలో ఉన్న వారికి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సాయం చేశారు. సాలరే మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా వరద బాధితులకు రిలీఫ్ కిట్లను అందించారు. హఫీజ్బాబనగర్లో ఉన్న ఒవైసీ స్కూల్ ఆఫ్ ఎక్ససెలెన్స్ వద్ద 3వేల కుటుంబాలకు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
వరద బాధితులకు రిలీఫ్ కిట్ల పంపిణీచేసిన అక్బరుద్దీన్ ఓవైసీ - పాతబస్తీలోని వరద బాధితులకు రిలీఫ్ కిట్ల పంపిణీ
వర్షం ధాటికి సర్వస్వం కోల్పోయిన 3 వేల కుటుంబాలకు 33 రకాల వస్తువులున్న కిట్లను ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అందజేశారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పరిధిలోని హఫీజ్బాబనగర్లోని ఒవైసీ స్కూల్ ఆఫ్ ఎక్ససెలెన్స్ వద్ద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
వరద బాధితులకు రిలీఫ్ కిట్ల పంపిణీచేసిన అక్బరుద్దీన్ ఓవైసీ
ఈ కిట్లలో నిత్యావసర వస్తువులు, బట్టలు, వంట సామగ్రి, గిన్నెలు, బకెట్, గ్లాస్, మగ, ఆడ, పిల్లలకు 2 జతల చొప్పున అందరికీ దుస్తులు, దుప్పట్లు, టవల్, తదితర 33 వస్తువులు ఉన్నాయి.
ఇదీ చూడండి:వరదల నేపథ్యంలో భాగ్యనగరంలో ఇళ్లు భద్రమేనా?